Site icon NTV Telugu

Modi-Trump: మోడీ-ట్రంప్ భేటీపై ఇరు దేశాలు ప్రయత్నాలు.. త్వరలోనే తేదీ ప్రకటన..

Modi Trump

Modi Trump

Modi-Trump: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయని ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు మంత్రిత్వ శాఖ చెప్పింది. ఇరువురు నేతల భేటీపై రెండు దేశాలు కృషి చేస్తున్నట్లు తెలిపింది. ‘”భారతదేశం-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి అమెరికా పర్యటనకు ఇరు పక్షాలు కృషి చేస్తున్నాయి. పర్యటనకు సంబంధించిన నిర్దిష్ట తేదీలను తగిన సమయంలో ప్రకటిస్తారు” అని చెప్పింది.

Read Also: AP DGP: ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు.. వారిని మాత్రం విదిలి పెట్టం..

నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన్న ప్రపంచ అగ్రనేతల్లో ప్రధాని మోడీ ఒకరు. ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో వైట్‌హౌజ్‌లో మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ట్రంప్ వచ్చిన తర్వాత సుంకాల పేరుతో పలు దేశాలను బెదిరిస్తున్నాడు. ఈ జాబితాలో ఇండియా కూడా ఉంది. ఇదే సమయంలో అమెరికా వీసాలు, అక్రమ వలసదారుల అంశంలో కూడా ఇండియాకు ప్రాధాన్యత అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మోడీ-ట్రంప్ పర్యటన కీలకంగా మారింది.

Exit mobile version