NTV Telugu Site icon

Delhi: టీఆర్ఎస్ ఎంపీల ధర్నా..మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

Trs Mps Protest

Trs Mps Protest

TRS MPs Protest..Slogans against Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబడుతున్నారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బనం, ఇతర ప్రజా సమస్యలపై తక్షణమే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రత్యేక చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు, టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వర రావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు విపక్ష ఎంపీలతో కలసి పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఎండగడుతూ.. మోదీ డౌన్ డౌన్ అంటూ.. కేంద్ర ప్రభుత్వ మొంవడి వైఖరి నశించాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చించాలని పట్టుబడితే ఎంపీలను సస్పెండ్ చేయడం అన్యాయం అని ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. వెంటనే రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండివైఖరిని నిరశిస్తూ నిరసన తెలుపుతున్న రాజ్యసభ సభ్యులను నస్పెండ్ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించినందుకు నస్పెండ్ చేస్తారా ? అని ప్రశ్నించారు.

Read Also: Umesh Kolhe Case: ఉమేష్ కోల్హే హత్య నిందితుడిపై జైల్లో దాడి

ధర్నా కార్యక్రమంలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, కె. ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, దివకొండ దామోదర రావు, బండి పార్థసారధిరెడ్డి, మన్నే శ్రీనివాస రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, మలోత్ కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని, పోతుగంటి రాములు, పూసునూరి దయాకర్ తదితరుల తో పాటు విపక్షాల ఎంపీలు కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్, విపక్షాల ఎంపీల ఆందోళనతో లోక్ సభ , రాజ్యసభ 2 గంటలకు వాయిదా పడింది.