Site icon NTV Telugu

Delhi : ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..

Delhi Fog

Delhi Fog

దేశంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి.. ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో తప్పనిసరి అయితే తప్ప ఉదయం, రాత్రి వేళల్లో జనం ఇళ్ల నుంచి కాలు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు.. ఢిల్లీలో చలి మరింత తీవ్రంగా ఉంది. గడిచిన రెండు వారాల మాదిరిగానే ఈ రోజు ఉదయం కూడా అక్కడ 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉదయం బయటికి వచ్చేవాళ్లే లేరు.. కొన్ని పరిస్థితుల కారణంగా బయటకు వచ్చిన జనం చలికి గజగజ వణుకుతున్నారు. ఎముకలు కొరికే చలికి తాళలేక పలు ప్రాంతాల్లో జనం చలిమంటలు వేసుకుంటున్నారు. ఇళ్లు కూడా లేని నిస్సహాయులకు ఢిల్లీలోని నైట్‌ షెల్టర్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.. ఈ చలి కారణంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాల్లో ఉదయం వేళల్లో దట్టంగా పొగమంచు కమ్ముతోంది.

పొగ మంచు దట్టంగా ఉండటం వల్ల రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలు రెండు, మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి.. ఉదయం పూట వెళ్ళాల్సిన కొన్ని రైళ్లు పూర్తిగా రద్దయినట్లు తెలుస్తుంది.. దట్టమైన పొగమంచు కారణంగా దాదాపు 120 విమానాలు (దేశీయ మరియు అంతర్జాతీయ) రాకపోకలు మరియు నిష్క్రమణలను ప్రభావితం చేసే విమాన కార్యకలాపాలలో ఆలస్యం అవుతుందని అధికారులు ప్రకటించారు.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలుస్తుంది..

Exit mobile version