Site icon NTV Telugu

Delhi Shopping Festival: కేజ్రీవాల్ కీలక నిర్ణయం..ఇండియాలోనే అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్

Arvind Kaejriwal

Arvind Kaejriwal

ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ షాపింగ్ ఫెస్టివల్ ను ఢిల్లీలో నిర్వహించనున్నారు. దీన్ని ప్రపంచంలో అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్ గా తీర్చిదిద్దనున్నట్లు సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. 2023 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనున్నారు. 30 రోజుల పాటు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనుంది ఢిల్లీ సర్కార్.

Read Also: Nizamabad: కరాటే శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు.. ముగ్గురు అరెస్ట్

ఢిల్లీ సంస్కృతి తెలిసేలా దేశవ్యాప్తంగా, ప్రపంచం నుంచి ప్రజలను ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. భారీ డిస్కౌంట్లను అందిస్తామని ఆయన వెల్లడించారు. పూర్తిగా ప్రభుత్వం ఈ షాపింగ్ ఫెస్టివల్ ను నిర్వహించనుంది. దీంతో పాటు ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తామని కేజ్రీవాల్ అన్నారు. ఈ బిగ్గెస్ట్ షాపింగ్ ఫెస్టివల్ వినియోగదారులకు మధురానుభూతిని ఇస్తుందని ఆయన అన్నారు. అయితే ఈ ఫెస్టివల్ ద్వారా ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని.. ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊపు వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీలోని వ్యాపారవేత్తలకు ఇది గొప్ప అవకాశంగా అభివర్ణించారు. వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఢిల్లీ షాపింగ్ ఫెస్టివల్ మంచి అవకాశంగా.. ఢిల్లీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ఇదో మంచి అవకాశం అని.. దీని ద్వారా వేల ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని ఆయన అన్నారు.

Exit mobile version