NTV Telugu Site icon

Butter Chicken: “బటర్ చికెన్” కోసం ఢిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటం..

Butter Chicken

Butter Chicken

Butter Chicken: బటర్ చికెన్.. ఈ పేరు మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ రెసిపి ఇండియాలోనే మొదలైనప్పటికీ.. దాని టేస్ట్ మాత్రం ప్రపంచానికి చేరింది. తాజాగా ఈ వంటకం కోసం రెండు రెస్టారెంట్లు ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. బటర్ చికెన్‌తో పాటు దాల్ మఖ్కీ తామే కనిపెట్టామనే ట్యాగ్ వాడుకోవడంపై మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్లు ఫైట్ చేస్తున్నాయి.

మోతీ మహల్ రెస్టారెంట్, దర్యాగంజ్ రెస్టారెంట్ యజమానులపై దావా వేసింది. వారు ఈ వంటకాలను మేమే తయారు చేసినామని తప్పుగా చెబుతున్నారంటూ హైకోర్టులో న్యాయపోరాటం నడుస్తోంది. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజీవ్ నరులా, దర్యాగంజ్ రెస్టారెంట్ యజమానులను ఒక నెలలోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Read Also: Ram Mandir: రామ మందిర నిర్మాణ ఖర్చు, దర్శనం-హారతి సమయం.. పూర్తి వివరాలు మీ కోసం..

ఈ రెండు రెస్టారెంట్లు బటర్ చికెన్, దాల్ మఖ్కీని కనిపెట్టినట్లు కొన్నాళ్లుగా ప్రకటించుకుంటున్నాయి. మోతీ మహల్ వ్యవస్థాపకుడు కుండల్ లాల్ గుజ్రాల్ ఈ వంటకాన్ని కనిపెట్టినట్లు కోర్టులో పేర్కొంది. అమ్ముడుపోని తందూరీ చికెన్‌కి ఇతర పదార్థాలు, సాస్‌ కలిపి బటర్ చికెన్ సృష్టించినట్లు మోతీ మహల్ పేర్కొంది. మరోవైపు కుండల్ లాల్ జగ్గీ ఈ వంటకాన్ని తెచ్చినట్లు దర్యాగంజ్ తెలిపింది.

దర్యాగంజ్ తరపు న్యాయవాది వాదిస్తూ, మొదట మోతీ మహల్ రెస్టారెంట్ పాకిస్తాన్‌లోని పెషావర్‌లోని మోతీ మహల్‌కు చెందిన గుజ్రాల్ మరియు దర్యాగంజ్‌కు చెందిన జగ్గీకి మధ్య జాయింట్ వెంచర్‌గా ఉందని కోర్టుకు తెలిపారు. మే 29న కోర్టు తదుపరి విచారణను చేపట్టనుంది, అప్పటి వరకు “బటర్ చికెన్ మరియు దాల్ మఖానీ యొక్క ఆవిష్కర్త ఎవరు” అనే దానిపై ఉత్కంఠగా చర్చ కొనసాగనుంది.

Show comments