Site icon NTV Telugu

Monkeypox: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు నమోదు.. 5కు చేరిన సంఖ్య

Monkeypox Virus

Monkeypox Virus

Monkeypox: దేశ రాజధానిలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ ఆస్పత్రిలో చేరిన 22 ఏళ్ల యువతికి పాజిటివ్ వచ్చింది. ఈ కేసుతో ఢిల్లీలో కేసుల సంఖ్య 5కు చేరింది. ఆస్పత్రిలో చేరిన యువతికి శుక్రవారం పాజిటివ్‌గా తేలిందని.. ప్రస్తుతం ఆమె పరిశీలనలో ఉందని ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రి వైద్యుడు సురేశ్ కుమార్‌ వెల్లడించారు. ఈమధ్య కాలంలో ఆమె ఇతర దేశాలకు వెళ్లలేదన్నారు. అయితే నెల రోజుల క్రితం నైజీరియా వెళ్లివచ్చారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నలుగురు మంకీపాక్స్‌ బాధితులు చికిత్స పొందుతున్నారని, మరొకరు కోలుకుని డిశ్చార్జీ అయ్యారని వెల్లడించారు. వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు.

Salman Khan: ఆ వీడియోలను తొలగించాలని కోర్టుకెక్కిన సల్లు భాయ్

ఢిల్లీలో మొదటి మంకీపాక్స్‌ కేసు జులై 24న నమోదయింది. అంతకు ఒకరోజు ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. భారతదేశంలో వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ కేసు కేరళలోని కొల్లం జిల్లాలో జూలై 14న నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్ అనేది వైరల్ జూనోసిస్ (జంతువుల నుండి మానవులకు సంక్రమించే వైరస్). మశూచి రోగులలో గతంలో కనిపించిన లక్షణాలను పోలి ఉంటుంది. అయినప్పటికీ ఇది వైద్యపరంగా తక్కువ తీవ్రతతో ఉంటుంది.

Exit mobile version