NTV Telugu Site icon

Delhi Pollution: అతిషి సర్కార్ కీలక నిర్ణయం.. ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు

Delhiprimaryschools

Delhiprimaryschools

దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి. పూర్తిగా గాలి నాణ్యత దెబ్బతింది. దీంతో పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ స్కూళ్లు మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇవి కొనసాగుతాయన్నారు.

ఇది కూడా చదవండి: తమ భార్యల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ క్రికెటర్లు వీళ్లే..

ఢిల్లీలో దాదాపు 432 పాయింట్లకు పైగా వాయు కాలుష్యం పెరిగింది. ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-III’ని అమలు చేస్తున్నట్లు ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ ప్రకటించింది. శుక్రవారం నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశించింది. జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అలాగే ఢిల్లీ నగరంలోకి “బిఎస్-3” వాహనాలు, డీజిల్ వాహనాలు ప్రవేశ పై నిషేధం విధించింది. ఇక ఢిల్లీలోని రహదారులు, చెట్లపై నీళ్లు చల్లే వాహనాల సంఖ్యను పెంచింది.

ఇది కూడా చదవండి: Congress: హామీలతో ఆర్థిక సమస్యలు.. ‘‘గ్రీన్ సెస్’’ విధించే దిశగా కర్ణాటక సర్కార్..