NTV Telugu Site icon

Delhi pollution: వరుసగా రెండోరోజూ ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ఏక్యూఐ 428గా నమోదు..

Delhi

Delhi

Delhi pollution: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం వరకు 428గా నమోదైంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (GRAP) 3 అమలు చేస్తున్నట్లు ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ పేర్కొనింది. కాగా, ఈరోజు (శుక్రవారం) నుంచి ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు 300 విమాన సర్వీసులు లేట్ గా నడుస్తున్నాయని అధికారులు చెప్పుకొచ్చారు. వాయు కాలుష్యం తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలలు (5వ తరగతి వరకు) వర్చువల్ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆతిశీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఇవి అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

Read Also: Allu Arjun: అల్లు అర్జున్ కి పోటీ ప్రభాసా? మహేషా? అంత మాట అనేశాడు ఏంటి?

కాగా, గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ స్టేజ్‌ 3 ఆంక్షల ప్రకారం.. అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉండబోతుంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సెలవు ఇస్తారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఆతిశీ స్పందిస్తూ.. కాలుష్య తీవ్రత దృష్ట్యా అన్ని ప్రాథమిక పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా తెలిపారు. అలాగే, కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఢిల్లీ వాతావరణ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో వాయు నాణ్యత సూచీ 35గా ఉంటే.. ఇక్కడ (ఢిల్లీ) మాత్రం గ్యాస్‌ చాంబర్‌లోకి ప్రవేశించినట్టుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కాలుష్యం పెరుగటం వల్ల పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు.