Delhi Police: ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనర్‌పై కేసు విషయంలో.. ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
- మైనర్‌ను క్షమించిన ప్రధాని మోడీ
- ఢిల్లీ పోలీసుల కీలక నిర్ణయం
- నోయిడా పోలీసుల నుంచి జీరో ఎఫ్ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Police PM Modi Case: న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనర్ బాలికపై కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఢిల్లీ పోలీసు వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయా మీడియా ఛానల్ నివేదించింది. గత నెలలో జరిగిన కాక్రోచ్ జంతా పార్టీ (CJP) నిరసన సందర్భంగా బాలిక ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం చెలరేగింది.
నోయిడా పోలీసుల నుంచి జీరో ఎఫ్ఐఆర్
ఈ వ్యవహారంలో నోయిడా పోలీసులు తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్లో బాలిక వయస్సును 25 ఏళ్లుగా పేర్కొన్నట్లు సమాచారం. తర్వాత వైరల్ అయిన మరో వీడియోలో ఆమె తన వయస్సు 15 సంవత్సరాలని వెల్లడిస్తూ, నిరసన ప్రదేశంలో ఇతరుల ప్రభావంతో ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది. తన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పింది.
Also Read
‘ఇది నా మొదటి, చివరి తప్పు’
తన క్షమాపణ వీడియోలో మైనర్ బాలిక తన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. తాను చేసిన పని క్షమించరానిదని, చాలా తప్పుగా మాట్లాడానని పేర్కొంది. తనకు జరిగినది మొదటి, చివరి తప్పు అని చెబుతూ దేశ ప్రజలను క్షమించాలని ఆమె కోరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పలువురు విజ్ఞప్తులు చేశారు.
మైనర్‌ను క్షమించిన ప్రధాని మోడీ
ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. తనను దూషించిన వారిని శిక్షించడం లేదా కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల పరిస్థితులు మారవని ఆయన అన్నారు. తప్పుదారి పట్టిన పిల్లలను తాను క్షమిస్తున్నట్లు పేర్కొంటూ, సమాజం కూడా తన నిర్ణయాన్ని అంగీకరించాలని కోరారు. మైనర్ కావడంతో ఆమె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
తల్లి కూడా ప్రధానికి విజ్ఞప్తి
మైనర్ బాలిక తల్లి కూడా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. బాలికను క్షమించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తప్పు పేరుతో, తప్పు వయస్సుతో నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని అధికారులను ఆదేశించాలని ఆమె ప్రధానిని కోరారు. తన కుమార్తెకు ప్రధాని క్షమాభిక్ష కొత్త జీవితాన్ని ఇచ్చినట్లుగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అలాగే 18 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించాలని కూడా ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలు సులభంగా ఇతరుల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని, వారిని నిరసన ప్రదేశాలకు తీసుకెళ్లకుండా చదువుపైనే దృష్టి పెట్టేలా చూడాలని ఆమె సూచించారు.
ఐదు వారాలకు పైగా కొనసాగిన CJP నిరసన
కేంద్ర ప్రభుత్వాన్ని NEET పేపర్ లీక్ వ్యవహారంలో జవాబుదారీగా చేయాలని డిమాండ్ చేస్తూ CJP జంతర్ మంతర్ వద్ద ఐదు వారాలకు పైగా నిరసన చేపట్టింది. ఈ ఆందోళనకు ప్రధానంగా విద్యార్థులు, యువత మద్దతు ఇచ్చారు. గత నెలలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, అలాగే నిరసనకారులపై బలవంతపు చర్యలు తీసుకోకూడదనే డిమాండ్ సహా పలు అంశాలపై ప్రభుత్వం అంగీకరించడంతో CJP తన నిరసనను విరమించుకున్నట్లు సమాచారం. మైనర్‌పై కేసు విషయంలో ఢిల్లీ పోలీసుల తాజా నిర్ణయం నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే బాలిక భవిష్యత్తు, మైనర్లపై చట్టపరమైన చర్యలు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై కూడా ఈ ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
తాజావార్తలు
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Randeep Hooda: ‘‘అహింసతో మాత్రమే స్వాతంత్య్రం రాలేదు’’.. సావర్కర్‌పై బాలీవుడ్ స్టార్ కీలక వ్యాఖ్యలు..
-
Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!