Site icon NTV Telugu

Wrestlers Protest: లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్‌పై విచారణకు సిట్ ఏర్పాటు..

Wfi Chief

Wfi Chief

Wrestlers Protest: దబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ పై మహిళా రెజర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఆరోపనపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం ప్రత్యేక కోర్టుకు తెలిపారు. స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రతిస్పందనగా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ముందు ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు.

Read Also: Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్

కేసు తీవ్రత దృష్ట్యా సిట్ ని ఏర్పాటు చేశాం, సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసినట్లు తెలిపారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో నివేదికను ఎవరితోనూ పంచుకోవద్దని కోరారు. సిల్డ్ కవర్ లో ఈ నివేదికను ఢిల్లీ పోలీసులు దాఖలు చేశారు. తదుపరి విచారణ మే 27కి కోర్టు వాయిదా వేసింది. మైనర్ తో సహా పలువరు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని బ్రిజ్ భూషణ్ సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆయనను అరెస్ట్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు పోక్సో చట్టంలోని సెక్షన్ 10తో సహా మొత్తం రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలు అన్ని అబద్ధం అని బ్రిజ్ భూషణ్ అన్నారు. నిజమని తేలితే ఉరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటు ఇటీవల వ్యాఖ్యానించారు.

Exit mobile version