Shraddha Walkar Case: దేశాన్ని కుదిపేసిన శ్రద్ధా వాకర్ కేసులో ఢిల్లీ పోలీసుల 3000 పేజీల ఛార్జీషీట్ రెడీ చేశారు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత క్రూరంగా హత్య చేసి శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 100 మంది సాక్ష్యాలతో పాటు ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో ఛార్జీషీట్ సిద్ధం చేశారు. దీనిని న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. పరీశీలన అనంతం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Read Also: Nagababu : నా పర్యటనతో రోడ్డు బాగుపడుతుంది అంటే అదే సంతోషం
శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలుగా చేసిన తర్వాత ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేశాడు అఫ్తాబ్. అరెస్ట్ తర్వాత అఫ్తాబ్ ఇచ్చిన సమాచారంతో 13 ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా.. ఇవి శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో సరిపోయాయి. దీంతో కేసు మరింతగా బలపడింది. ఇక నార్కో, పాలిగ్రాఫ్ టెస్టుల్లో కూడా అఫ్తాబ్ శ్రద్దాను చంపినట్లు ఒప్పుకున్నాడు. వీటన్నింటిని ఛార్జిషీట్ లో పొందుపరిచారు. ఈ నెలఖారులో కోర్టులో సమర్పించే అవకాశం ఉంది.
గతేడాది మే నెలలో అఫ్తాబ్, శ్రద్ధా వాకర్ ను ఢిల్లీలో హత్య చేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు తర్వాత ఆమె మరణం సంగతి ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయిన శ్రద్ధాను పలుమార్లు తీవ్రంగా కొట్టి హింసించాడు. పెళ్లి చేసుకోవాలని కోరిన సందర్భంతో అత్యంత క్రూరంగా మెడ కోసి హత్య చేశాడు. ఆదే సమయంలో అఫ్తాబ్ పలువురు యువతులతో డేటింగ్ చేస్తున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది.