Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
- ఢిల్లీలో రేపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసన..
- అనుమతి కోరలేదంటున్న పోలీసులు..
- అనుమతి ఇవ్వలేదంటున్న సీజేపీ..
- ఢిల్లీలో పోలీసుల హై అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cockroach Janta Party: సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘‘కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)’’ జూన్ 6న ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శనను ప్రకటించింది. జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపడుతామని ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. సోషల్ మీడియాలో ఈ ప్రకటన ఇప్పటికే వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి అధికారికంగా అనుమతి కోరుతూ ఎలాంటి దరఖాస్తు అందలేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రేపు నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనపై సోషల్ మీడియా ప్రచారంపై పోలీసులు కన్నేసి ఉంచారు. ఢిల్లీ పోలీసులు ప్రకారం.. జంతర్ మంతర్ వద్ద ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగా అనుమతి తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. దరఖాస్తు అందితే భద్రతా పరిస్థితులు, పరిపాలనా అంశాలు, ప్రజా శాంతి భద్రతల దృష్ట్యా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
Also Read
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
- Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
సోషల్ మీడియాలో ప్రచారం నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు. మరోవైపు తాము దరఖాస్తు చేసుకున్నామని పోలీసులు అనుమతి ఇవ్వలేదని సీజేపీ ప్రతినిధులు చెబుతున్నారు. నీట్ పేపర్ లీక్ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
-
AP Weather: ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓ వైపు పిడుగులు.. మరోవైపు భానుడి భగభగలు..
-
PM Modi: భారత్ దూకుడు.. జీడీపీ వృద్ధిరేటు పెరగడంపై మోడీ హర్షం.. ఎక్స్‌లో కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!