NTV Telugu Site icon

Delhi Metro: ఆగస్టు 15న సర్వీసులపై ఢిల్లీ మెట్రో కీలక ప్రకటన

Delhimetro

Delhimetro

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మెట్రో సేవల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆగస్టు 15 ఉదయం 4 గంటలకే సర్వీసులు ప్రారంభమవుతాయని ఢిల్లీ మెట్రో సంస్థ ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యే ప్రజల సౌలభ్యం కోసం ఈ సర్వీసుల్లో మార్పులు చేసినట్లు ఢిల్లీ మెట్రో ప్రకటన చేసింది.

ఇది కూడా చదవండి: Manu Bhaker: భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించాలి..

ఇదిలా ఉంటే వేడుకలకు హాజరయ్యేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన బోనఫైడ్ ఆహ్వానం కార్డును అనుమతిస్తున్నట్లు డీఎంఆర్‌సీ తెలిపింది. ప్రభుత్వ ఐడీ కార్డుతో రైల్లో ప్రవేశించడానికి… ప్రయాణించడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపింది. ఈ వెసులుబాటు లాల్ క్విలా, జామా మసీదు, చాందినీ చౌక్ మెట్రో స్టేషన్‌ల్లో మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అలాగే తిరుగు ప్రయాణంలో కూడా ఈ మూడు స్టేషన్ల నుంచే ఆహ్వాన కార్డ్‌లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఏర్పాట్ల గురించి ప్రయాణీకులకు తెలియజేయడానికి రైళ్ల లోపల రెగ్యులర్ ప్రకటనలు చేయబడతాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే అన్ని స్టేషన్లలో ప్రతి 15 నిమిషాలకు ఒక సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపింది. కేవలం ఆగస్టు 15న మాత్రమే ఉదయం 4 గంటలకు సర్వీసులు ప్రారంభం అవుతాయని.. మిగతా రోజుల్లో మాత్రం సాధారణ టైమ్‌టేబుల్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రయాణాలకు అయ్యే ఖర్చును రక్షణ మంత్రిత్వ శాఖ DMRCకి తిరిగి చెల్లించనుంది.

ఇది కూడా చదవండి: Sobhita : ఆమె కుక్కగా పుట్టినా పర్లేదు… సమంతపై శోభిత పాత పోస్ట్ వైరల్!

Show comments