Site icon NTV Telugu

Delhi metro: మెట్రో రైల్వేట్రాక్‌పై వ్యక్తి హల్‌చల్.. 20 నిమిషాలు నిలిచిన ఢిల్లీ మెట్రో సేవలు

Delhimetro

Delhimetro

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో సేవలకు అంతరాయం కలిగింది. రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. దీంతో కొద్దిసేపు రైల్వే సేవలకు ఆటంకం కలిగింది. దాదాపు 15-20 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడినట్లు డీఎంఆర్‌సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇది కూడా చదవండి: Good News: సింగరేణి కార్మికులకు సీఎం శుభవార్త.. దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్

శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటలకు పితాంపురా స్టేషన్‌లో ట్రాక్‌పై ఓ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. రెడ్‌లైన్‌లో కనిపించడంతో ఢిల్లీ మెట్రో సేవలు కొద్దిసేపు నిలిచిపోయాయి. రెడ్ లైన్ ఢిల్లీలోని రిథాలాను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని షహీద్ స్థల్‌కి కలుపుతుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. వెంటనే ఆ వ్యక్తిని పైకి తీసుకొచ్చారు. అయితే ఒక్కసారిగా మెట్రో సేవలు ఆలస్యం కావడంతో ఏం జరిగిందో ప్రయాణికులకు అర్ధం కాలేదు. దీంతో కొంత అయోమయానికి గురయ్యారు. మొత్తానికి 20 నిమిషాల తర్వాత సేవలు పునరుద్ధరించబడ్డాయని డీఎంఆర్‌సీ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: TCS: మళ్లీ “టాటా” టాప్.. భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్

వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకు ట్రాక్‌పైకి వెళ్లాల్సి వచ్చిందని ఆరా తీస్తున్నారు. ఈ మధ్య రైళ్లల్లో, విమానాల్లో, ఎక్కడ పడితే అక్కడ రీల్స్ మోజులో షూటింగ్‌లు చేస్తున్నారు. అలాంటి కోణం ఏమైనా ఉందా? ఇంకేమైనా కోణం ఉందా? అన్న విషయంపై విచారణ కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Health Tips: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ నీళ్లను తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Exit mobile version