Son Attacked Parents: స్టాక్ మార్కెట్‌లో రూ. 10 లక్షల నష్టాన్ని పూడ్చేందుకు తన తండ్రి తనకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో, కన్న కొడుకు కనిపెంచిన తల్లిదండ్రులను అతి కిరాతకంగా కత్తితో పొడిచి, సుత్తితో కొట్టి చంపాడు. అనంతరం ఇంట్లో వున్న సొత్తును తీసుకెళ్లాడు. తండ్రి మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన ఢిల్లీలోని ఫతే నగర్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది
టెంట్ హౌస్ వ్యాపారి అయిన స్వర్ణ్‌జీత్ సింగ్, అతని భార్య అజిందర్ కౌర్, ఓ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్నాడు. అదే ఇంట్లోని పై ఫ్లోర్ లో అతని కొడుకు జస్దీప్ తన భార్యతో కలిసి నివాసం వుంటున్నాడు. టెంట్ హౌస్ వ్యాపార యజమానికి ఇద్దరు వివాహిత కుమార్తెలు కూడా ఉన్నారు, వారు వేరే చోట నివసిస్తున్నారు. అయితే కొడుకు ఎక్కువగా స్టాక్ మార్కెట్ పై డబ్బులను ఎక్కువగా ఖర్చు పెట్టేవాడని, అది సరైన పద్దతి కాదు టెంట్ హౌస్ వ్యాపారంపై దృష్టి పెట్టాలని స్వర్ణ్‌జీత్, జస్దీప్‌తో నిరంతరం చెప్పావాడు. అయినా వినని జస్దీప్ స్టాక్ మార్కెట్ లో డబ్బులను ఎక్కువగా పెట్టేవాడు అంతేకాకుండా దానికోసం తండ్రిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు.
Read also: Business Today: Today Business Highlights 08-10-22
కుమారుడి ప్రవర్తనతో విసిగిన తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో కొడుకు పథకం ప్రకారం వీరిద్దరిని హత్య చేసేందుకు ప్లాన్ వేసి శుక్రవారం ఉదయం 6 గంటలకు వారు తినే వాటిలో ఓ తిండిపదార్థంలో విషపదార్థాన్ని కలిపాడు. దీంతో వారిద్దరు ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. కొడుకు తనతో పాటు తెచ్చుకున్న సుత్తి, స్కూడ్రైవర్ లాంటి పదునైనా ఆయుధాలతో ఇద్దరి ముఖాలపై కిరాతకంగా దాడిచేశాడు. తల్లిదండ్రులపై దొంగలు దాడి చేసినట్లు కనిపించడానికి వస్తువులను తరలించాడు. అయినప్పటికీ.. తన తల్లి ఇంకా బతికే ఉందని అతను గ్రహించలేదు.జస్దీప్ చంపాడని ఉపయోగించిన కత్తి, సుత్తిని స్థానిక పార్కులో విసిరాడు.అయితే.. అక్కడే ఉన్న కౌన్సిలర్ ఇంటికి చేరుకుని, ఇంట్లో ఎవరో చొరబడ్డారని తన తల్లిదండ్రులను హతమార్చారని కట్టుకథలు చెప్పాడు.
దీంతో కౌన్సిలర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న వృద్ధులను చూసి షాక్ కు గురయ్యారు. పోలీసులకు సన్నీ మీద అనుమానం కలిగింది.. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. మొదట్లో బుకాయించిన సన్నీ ఆ తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. బాధితుడి ముఖంపై దాదాపు 37 గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జస్దీప్ భార్యను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిచారు.
Special (Success) Story of Zepto: పదే పది నిమిషాల్లో డోర్ డెలివరీ. చందమామ కథలాంటి Zepto సక్సెస్ స్టోరీ..