NTV Telugu Site icon

Delhi Crime News: కుక్కపై అత్యాచారం.. కెమెరాకి చిక్కిన నిందితుడు

Man Molested Dog

Man Molested Dog

Delhi Man Caught On Camera Molesting A Dog In Harinagar: కామాంధుల నుంచి మహిళలకే కాదు.. కుక్కలకు కూడా రక్షణ లేకుండా పోయింది. చివరికి వాటిపై కూడా అత్యాచారానికి పాల్పడుతున్నారు కొందరు కీచకులు. ఇందుకు తాజాగా ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం. దేశ రాజధాని ఢిల్లీలోని హరినగర్ ఏరియాలో.. ఓ వ్యక్తి కుక్కపై అత్యాచారానికి పాల్పడుతూ కెమెరాకి అడ్డంగా దొరికాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దారుణమైన దృశ్యాన్ని చూసి.. వెంటనే తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశాడు. అనంతరం దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కి కూడా వెళ్లాడు. అయితే.. ఆ వ్యక్తి షేర్ చేసిన స్క్రీన్ షాట్ బట్టి చూస్తుంటే, కుక్కపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిరాకరించినట్లు తెలుస్తోంది. SHO అతన్ని ఫిర్యాదు చేయవద్దని ఒప్పించినట్లు అర్థమవుతోంది. 2-3 రోజుల తర్వాత ఆ వ్యక్తి వస్తే.. అప్పుడు చర్యలు తీసుకుందామని చెప్పినట్లు స్పష్టమవుతోంది.

Causeway Bridges : చాదర్‌ఘాట్‌, మూసారాంబాగ్‌లో రెండు కాజ్‌వే వంతెనలు

ఈ వ్యవహారంపై జంతు సంరక్షకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కుక్కపై అత్యాచారం జరిగిన ఘటనను, దానికి పోలీసులు రియాక్ట్ అయిన తీరుని తీవ్రంగా ఖండించారు. యాంటీ క్రూయెల్టీ ఆఫీస్ తరుణ్ అగర్వాల్ ఆ అత్యాచారం వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన తర్వాత.. ఇతర జంతు సంరక్షకులు సైతం స్పందించారు. ఈ ఘటనపై న్యాయం కోసం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సభ్యుడు పంఖూరి పాఠక్ కూడా ఈ విషయంలో తన గళం ఎత్తారు. ఇంతవరకు ఈ వ్యవహారంపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు, మరికొంత మంది అధికారులను ట్యాగ్ చేస్తూ.. ‘‘అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా, ఆ రాక్షసుడ్ని అరెస్ట్ చేయకుండా, ఢిల్లీ పోలీసులు అతనికి రక్షణ కల్పిస్తున్నారా? అతడ్ని ప్రోత్సాహిస్తున్నారా? SHO హరినగర్ దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది నేరం కాదా? అని మండిపడ్డారు.

Road Accident: కోనసీమలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి