Site icon NTV Telugu

MP Sanjay Singh: సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది..

Sanjay Singh

Sanjay Singh

MP Sanjay Singh: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి నుంచి జైలులో ఉన్నారు. జైలులో ఆయన ఆరోగ్యంపై రాజకీయాలు కొనసాగుతున్నాయి. సీఎం ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న వాదనల నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈరోజు ముఖ్యమంత్రికి ఎందుకు మందులు వాడడం లేదో తేల్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అయితే, ఈ లేఖపై ఆప్ పార్టీ స్పందించింది. ఢిల్లీకి చెందిన మంత్రి అతిషి, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఎల్జీ గవర్నర్ ని టార్గెట్ చేశారు.

Read Also: NEET UG 2024 : నీట్ యూజీ ఫలితాలు విడుదల

ఈ సందర్భంగా ఆప్ రాజ్యసభ సభ్యులు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. సీఎం కేజ్రీవాల్‌ను చంపేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ షుగర్‌ 8 సార్లు 50 కంటే కిందకు పడిపోయిందని అన్నారు. ఇలాగే, కొనసాగితే, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోమాలోకి వెళ్ళే విధంగా అతని ఆరోగ్యం దిగజారిపోతుందన్నారు. అటువంటి పరిస్థితిలో.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉందన్నారు. ఇక, లెఫ్టినెంట్ గవర్నర్ లేఖను ట్వీట్ చేస్తూ.. ఎల్జీ సార్ ఏం జోక్ చేస్తున్నారు..? మనిషి రాత్రిపూట తన షుగర్ స్థాయిలను తగ్గించుకుంటాడా..? అంటూ ప్రశ్నించారు. ఎల్జీ సార్, మీకు వ్యాధి గురించి తెలియకపోతే మీరు ఇలాంటి లేఖ రాయకూడదు అని మండిపడ్డారు. అలాంటి వ్యాది నీకు రాకూడదని ఆ దేవుడి కోరుకుంటున్నాను అని ఎంపీ సంజయ్ సింగ్ సెటైర్ వేశారు.

Exit mobile version