Site icon NTV Telugu

మందుబాబుల‌కు బ్యాడ్‌న్యూస్‌: అక్క‌డ రెండురోజులు లిక్క‌ర్ షాపులు బంద్‌…

ఈనెల 10 వ తేదీన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో తొలివిడత ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఎన్నిక‌ల కోసం ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని ఏర్పాట్లు చేసింది. క‌రోనా నిబంధ‌న‌లను అమ‌లు చేస్తూ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తొలివిడ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 8 నుంచి 10 వ తేదీ సాయంత్రం వ‌ర‌కు ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క వ‌ర్గాల్లో మందుషాపుల‌ను బంద్ చేస్తున్నారు. ఢిల్లీకి అతి స‌మీపంలో ఉన్న నోయిడా, ఘ‌జియాబాద్‌ల‌లో లిక్క‌ర్ షాపులు బంద్ అవుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 8 వ తేదీ సాయంత్రం 6 గంట‌ల నుంచి మొద‌టి ఫేజ్ ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు, అదేవిధంగా ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చే రోజైన మార్చి 10 వ తేదీన మందుషాపులను బంద్ చేయ‌నున్నారు. ఢిల్లీకి అతి స‌మీపంలో ఉండ‌టంతో ఘ‌జియాబాద్‌తో పాటు నోయిడాలో కూడా పూర్తి స్థాయిలో లిక్క‌ర్ షాపుల‌ను బంద్ చేస్తున్నారు. ఎన్నిక‌ల రోజున ఎలాంటి అవాంచ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఉండేలా ఇప్ప‌టికే ఎన్నిక‌ల క‌మిష‌న్ అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ది.

Read: కొత్త క‌రోనా కిట్‌: నాలుగు నిమిషాల్లోనే ఖ‌చ్చిత‌మైన రిజ‌ల్ట్‌…

Exit mobile version