Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ కస్టడీకి అనుమతించింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఏకంగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. లిక్కర్ స్కాం ఎలా జరిగిందో అనే వివరాలను రిమాండ్ రిపోర్టులో వివరించింది ఈడీ. శరత్ చంద్రారెడ్డి అరెస్టులో ఈడీ కీలకాంశాలను వెల్లడించింది. ఈ స్కామ్ లో 34 మంది పాత్ర బయటపడినట్లు వెల్లడించింది. లిక్కర్ స్కామ్ బయటపడటంతో 34 మంది 140 ఫోన్లను ఛేంజ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. సెల్ ఫోన్ల మార్పిడి కోసం ఏకంగా రూ. 1.20 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. ఈ స్కాంలో విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రోలది కీలక పాత్ర అని ఈడీ ఆరోపిస్తోంది.
Read Also: Afzal Khan’s Tomb Issue: అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్
లిక్కర్ స్కామ్ కోసం శరత్ చంద్రారెడ్డి లాబీ ఏర్పాటు చేసినట్లు తేలింది. 6 రిటైల్ జోన్ల కోసం పెద్ద మొత్తంలో ముడుపులు ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. సమీర్ మహేంద్రోతో కలిసి రూ.100 కోట్ల వరకు లంచాలను ఎర చూపారని ఆరోపిస్తోంది. శరత్ చంద్రారెడ్డి రూ. 64 కోట్లు వరకు మనీల్యాండరింగ్ కు పాల్పడ్డాడని ఈడీ రిమాండ్ డైరీలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు 169 ప్రాంతాల్లో సోదాలు చేశామని, డిజిటల్ డివైజస్ తో పాటు పలు రికార్డులను సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. లంచాల కోసం ప్రత్యేక్ వ్యవస్థను శరత్ చంద్రారెడ్డి ఏర్పాటు చేశాడని ఈడీ ఆరోపిస్తోంది.
ఈ స్కామ్ లో మనీలాండరింగ్ జరిగనట్లు సీబీఐ స్పెషల్ కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. జస్టిస్ నాగ్ పాల్ ఈడీ విచారణ కోసం శరత్ చంద్రారెడ్డి, విజయ్ బాబులను వారం రోజులకు పాటు కస్టడీకి అప్పగించారు. మరోవైపు సోమవారం రోజున దినేష్ ఆరోరా సీబీఐకి అఫ్రూవర్ గా మారారు. స్పెషల్ కోర్టులో దినేష్ అరోరా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఏం చేశారనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ కేసులో విచారణ ప్రారంభించిన సీబీఐ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ప్రధాన నిందితుడిగా పేర్కొంటోంది.
