NTV Telugu Site icon

Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో అభిషేక్ రావు అరెస్ట్.. కదులుతున్న డొంక

Abhi Scam

Abhi Scam

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా ప్రకంపనలు కలిగిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావుని అరెస్ట్ చేసింది సీబీఐ…. లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ తర్వాత అభిషేక్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. అభిషేక్ రావుని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీ తరలిస్తుంది సీబీఐ.

అభిషేక్ రావుకి 9 కంపెనీలతో సంబంధం వుంది.కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావు వాటాలు కలిగి వున్నాడు. ఆ 9 కంపెనీల్లో వివిధ రకాల వ్యాపారాలు వున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్ మరియు కెమికల్ ప్రొడక్స్ట్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు వున్నాయి. అభిషేక్ రావు అరెస్టుతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో డొంకంతా కదులుతుందని భావిస్తున్నారు.

Read Also: Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌తో పాటు 35 చోట్ల ఈడీ దాడులు

లిక్కర్ స్కాంలో ఈడీ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా 25 చోట్ల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అభిషేక్ రావు డైరెక్టర్ గా వున్న రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయం అనూస్ బ్యూటీ పార్లర్ లో ఏర్పాటుచేశారు. దీనిపై సీబీఐ కన్నేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలకంగా భావించే రామచంద్రన్ పిళ్ళైతో కలిసి అభిషేక్ రావు వ్యాపారాలు చేస్తున్నారు. అభిషేక్ రావుని ఢిల్లీ తీసుకెళ్ళి లోతుగా విచారిస్తే మరిన్ని తలకాయలు బయటపడవచ్చని అంటున్నారు.

బోయిన్ పల్లి అభిషేక్ రావు (Boinpally Abhishek Rao) డైరెక్టర్ గా ఉన్న 9 కంపెనీలు ఇవే
Agasti Ventures
SS Mines & Minerals
Master Sand LLP
Neoverse Realty Pvt ltd
Anoos Electrolysis & obesity
Valuecare Esthetics Pvt ltd
Zeus Networking pvt ltd
Robin Distribution LLP
Anoos Health & Wellness Pvt ltd.