Site icon NTV Telugu

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితదే ముఖ్యపాత్ర.. బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Delhi Liquor Scam

Delhi Liquor Scam

Delhi liquor Scam..Allegations on MLC Kavita: ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్ లింకులు బయటపడుతున్నాయి. తాజాగా కేంద్ర బీజేపీ నాయకులు ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ, ఈ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుటుంబం ఉందని ఆరోపించారు. ఈ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ కుమార్తె కవితదే ముఖ్యపాత్ర అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫ్యామిలీతో పాటు లిక్కర్ మాఫియా నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు రూ. 150 కోట్లు అందాయని సంచలన అన్నారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్ లో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపొందించారని… ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్, ఇతర ఎక్సైజ్ అధికారులతో పాటు కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఓబెరాయ్ హోటల్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం ప్రైవేట్ విమానంలో ఢిల్లీకి వచ్చేవారని..దీనికి తెలంగాణకు చెందిన లిక్కర్ మాఫియా సహకరించేదని ఆరోపించారు.

Read Also: KTR On Bandi Sanjay: అమిత్ షాకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ?

తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబంలోని పలువురు ఈ లిక్కర్ మాఫియాలో భాగస్వాములు ఉన్నారని వ్యాఖ్యానించారు. సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇద్దరు కలిసి ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారని అన్నారు. తెలంగాణలో కూడా ఇలాంటి మద్య విధానమే ఉందని.. పశ్చిమ బెంగాల్లో కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేస్తున్నారని.. ఎంపీ పర్వేజ్ వర్మ అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఎల్1 లైసెన్సు హోల్డర్లని ఆరోపించారు.

మద్యం మాఫియాను దక్షిణాది నుంచి ఢిల్లీకి తీసుకువచ్చింది కేసీఆర్ కూతురు కవితే అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ఆరోపించారు. రెడ్డి బ్రదర్స్ ను కూడా తీసుకువచ్చిందని ఆయన అన్నారు. కవిత ఢిల్లీకి వచ్చి రూ.4.5 కోట్లతో డీల్ కుదిర్చారని అన్నారు. ఆప్ పంజాబ్, గోవా ఎన్నికల సందర్భంగా అడ్వాన్సుగా డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. పంజాబ్ లో లిక్కర్ ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయించారని.. చద్ధా ఫ్యామిలీ నుంచి రూ. 4.5 కోట్లు ముట్టాయని ఆయన వ్యాఖ్యానించారు. రూ. 3 కోట్లు నగదు, రూ.1.5 కోట్ల క్రెడిట్ నోట్ తీసుకున్నారని అన్నారు. ఇదంతా కేసీఆర్ కూతురు కవిత ద్వారానే జరిగిందని ఆరోపించారు.

Exit mobile version