NTV Telugu Site icon

Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌తో పాటు 35 చోట్ల ఈడీ దాడులు

Ed Raids

Ed Raids

Delhi Liquor Policy Case-ED raids: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్ లోని 35 ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తోంది ఈడీ. ఈ రాష్ట్రాల్లో మద్యం కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, సప్లై చైన్ నెట్వర్క్ కు సంబంధించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.

శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈడీ అధికారులు సోదాలు ప్రారంభించారు. మనీలాండరింగ్ కేసు నేపథ్యంలో ఈడీ తాజాగా సోదాలు చేస్తోంంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ పలువురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. మనీష్ సిసోడియా, ఢిల్లీకి చెందిన పలువురు అధికారులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో పలు ధపాలుగా వివిధ దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహించాయి. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రను గత వారం అరెస్ట్ చేసింది ఈడీ. ఢిల్లి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ మద్యంపాలసీపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో ఈ ఏడాది జూలై నెలలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ మద్యం పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో సంబంధం ఉన్న 11 మంది ఎక్సైజ్ అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్ సస్పెండ్ చేశారు.

Read Also: Priyanka Chopra: ఇరాన్ మహిళల హిజాబ్ వ్యతిరేక పోరాటానికి ప్రియాంకా చోప్రా మద్దతు

మద్యం కుంభకోణం లో సమీర్ మహేంద్రుడిని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేయగా.. విజయ్ నాయర్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇండో స్ప్రిట్స్ యజమాని సమీర్ మహేంద్రూ 2021-22 కొత్త ఎక్సైజ్ పాలసీని తయారు చేస్తున్నప్పుడు, దానిని తప్పుబట్టి, ఈ విధానాన్ని అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. సమీర్ మహేంద్ర దినేష్ అరోరా ఖాతాకు రూ.1 కోటి బదిలీ చేసినట్లు చేశారు. దినేష్ అరోరా, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సన్నిహితుడని.. అరోరా ద్వారా సిసోడియాకు లాభం చేకూరినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో దినేష్ అరోరా పేరు కూడా ఉంది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడు అర్జున్ పాండే ఒకసారి విజయ్ నాయర్ ద్వారా ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు నుంచి సుమారు రూ.2 నుంచి 4 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.