కరోనా ఎవ్వరినీ వదలడంలేదు.. నిలువ నీడలేని సామాన్యుడైనా.. పెద్ద బంగ్లాలో ఉండే వీవీఐపీ అయినా.. అంతా దానికి సమానమే అనే రీతితో పంజా విసురుతూనే ఉంది.. తాజాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలిందని.. దాంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లానని ట్విట్టర్ తెలిపారు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్.. ఇక, ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్నందున తాను కోలుకునే వరకు ఇంటి నుంచే విధులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
కరోనా బారినపడ్డ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
Anil Baijal