NTV Telugu Site icon

EV adoption: దేశంలో పెరిగిన ఎలక్ట్రిక్ వాహనాల(EV) స్వీకరణ.. టాప్‌లో ఢిల్లీ..

Ev Adoption

Ev Adoption

EV adoption: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) స్వీకరణ పెరుగుతోంది. రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య దేశవ్యాప్తంగా మరింత పెరిగే అవకాశం ఉందని FICCI-యెస్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈవీ స్వీకరణలో ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉన్నట్లు చెప్పింది. ఢిల్లీలో ఈవీ పెనట్రేషన్ రేటు 11.5 శాతంగా ఉందని, వివిధ విభాగాల్లో ఈవీలను అడాప్ట్ చేసుకుంటున్నట్లు నివేదిక హైలెట్ చేసింది.

కేరళలో 11.1 శాతం, అస్సాంలో 10 శాతంగా ఉన్నాయని, ఇక్కడ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ట్రీ వీలర్ ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. దీనికి తోడు గుజరాత్, ఒడిశా, కేరళ, పంజాబ్ రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరాలు 21-24 వరకు ఈవీ అమ్మకాల్లో అత్యధితక కాంపౌడ్ వార్షిక వృద్ధి రేటు(CAGR) నమోదు చేశాయి. రాష్ట్రాలు సహకరించడం, ఈవీ వ్యూహాల ప్రాముఖ్యతను నివేదిక నొక్కొ చెప్పింది. ఈ ఐదు రాష్ట్రాలు 2024 ఆర్థిక సంవత్సరంలో ఈవీల పెరుదలలో సఘానికి పైగా దోహదపడ్డాయని, గత నాలుగేళ్లుగా ఈవీ అమ్మకాల విస్తరణ మెరుగుపడిందని నివేదిక పేర్కొంది.

Read Also: Hyundai Creta EV : హ్యుందాయ్ నుండి వచ్చిన ఈ బ్లాక్ బ్యూటీ మహీంద్రా కొత్త EVతో పోటీ పడుతోంది..!

దేశం నెట్-జీరో లక్ష్యాలను సాధించడానికి ఈవీ పరివర్తన అనేది చాలా కీలకమని చెప్పింది. 2030 నాటికి జాతీయ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రస్తుత EV వ్యాప్తి రేటును రెట్టింపు చేయాలని నివేదిక కోరింది. రాష్ట్రాలు తమ ఈవీ పాలసీలను 2030 వరకు పునరుద్ధరించాలని కోరింది. ప్రజారవాణా, విమానాల ఆపరేషన్స్‌లో ఈవీ స్వీకరణ తప్పనిసరి చేయాల్సిన అవసరాన్ని నివేదిక చెప్పింది. అనేక రాష్ట్రాల EV విధానాల గడువు ముగియడంతో, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మరియు EV స్వీకరణను వేగవంతం చేయడానికి స్థిరమైన మరియు దీర్ఘకాలిక విధాన వాతావరణాన్ని అందించడం యొక్క ప్రాముఖ్యతను నివేదిక నొక్కి చెప్పింది.

దేశం అంతటా జీరో ఎమిషన్ వెహికల్ (ZEV) వ్యాప్తిని పెంపొందించడానికి కార్యాచరణ సిఫారసులను అందిస్తూనే, ఆశయం-అమలుకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి రోడ్ మ్యాప్‌ని సూచించింది. స్థిరమైన ఆర్థిక చర్యల ద్వారా పరిశ్రమ అభివృద్ధికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రాష్ట్రాలు మరింత వేగం చేయాలని చెప్పింది.

Show comments