Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
- ఢిల్లీలో భారీ వర్షం
- ఉద్యోగస్తులకు ఇక్కట్లు
- విమాన రాకపోకలకు అంతరాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములతో కూడిన వర్షం హడలెత్తించింది. దీంతో నగరంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాయంత్రం పూట అకస్మాత్తుగా కురవడంతో ఉద్యోగస్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక విమాన రాకపోకల్లో కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
గత కొద్దిరోజులుగా ఎండలతో ఢిల్లీ నగరం హీటెక్కిపోయింది. ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో హఠాత్తుగా వర్షం కురవడంతో హస్తిన చల్లబడింది. వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ప్రజలు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఉక్కపోత నుంచి నగర ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.
Also Read
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
ఐఎండి ప్రకారం.. రాబోయే 2-3 రోజుల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. వడగాలులు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. వాయువ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత ఈ రోజు నుంచి తగ్గడం ప్రారంభం కావచ్చని పేర్కొంది. ఇక రాజస్థాన్, విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల పరిస్థితులు కొనసాగినప్పటికీ .. రేపటి నుంచి అవి గణనీయంగా తగ్గుతాయని అంచనా.
తుఫాను హెచ్చరిక
మే 28 నుంచి 31 మధ్య ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశాల్లో ఉరుములతో కూడిన వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా అనేక ప్రాంతాల్లో ధూళి తుఫానులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాబోయే 3-4 రోజుల్లో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పు వచ్చి.. వర్షపాతం పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ఉష్ణోగ్రతలు తగ్గి.. ఎండల నుంచి ఉపశమనం లభిస్తుంది.
#WATCH | Delhi witnesses a sudden change in the weather as rain lashes parts of the national capital.
Visuals from IGI Airport pic.twitter.com/4hhFy02xpK
— ANI (@ANI) May 28, 2026
#WATCH | Delhi witnesses a sudden change in the weather as rain lashes parts of the national capital.
Visuals from outside Terminal 4 of IGI airport. pic.twitter.com/jP0jt2qOQk
— ANI (@ANI) May 28, 2026
తాజావార్తలు
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!