Site icon NTV Telugu

Covid-19: ఫోర్త్‌ వేవ్‌ ఫీవర్.. అక్కడ ఫేస్‌మాస్క్‌లు ధరించకుంటే రూ.500 జరిమానా

Delhi Corona

Delhi Corona

Covid-19: దేశ రాజధానిలో కొత్తగా కొవిడ్‌ కేసులు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్‌మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్‌లు ధరించడం లేదని గుర్తించిన డీడీఎంఏ ఈ నిర్ణయం తీసుకుంది. జూలై చివరి 10 రోజులతో పోలిస్తే ఆగస్టులో కొవిడ్ మరణాలు దాదాపు మూడు రెట్లు పెరిగాయని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది.

New Delhi: అత్యాచారాలకు అడ్డాగా దేశ రాజధాని.. ఆరు నెలల్లో వెయ్యికి పైగా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండగా.. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం కరోనా కేసులు రోజుకు వేలల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు వైద్యం కోసం ఆస్పత్రులు చుట్టూ తిరుగుతున్నారు. పరీక్షల్లో ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడినట్లు లోక్‌నాయక్‌ జైప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 90 నమూనాల అధ్యయన నివేదికలో కొత్త సబ్-వేరియంట్ బీఏ-2.75గా గుర్తించబడింది. కొంతమందిలో అత్యంత వ్యాప్తి కలిగిన ఉపవేరియంట్‌ బీఏ 2.75ను గుర్తించినట్లు మెడికల్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డా.సురేశ్‌ కుమార్‌ తెలిపారు. ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ను లెక్కచేయకుండా ఈ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ శరవేగంగా విస్తరిస్తోందని వైద్యులు వెల్లడించారు. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండే ఈ సబ్‌వేరియెంట్‌ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ఈ వేరియంట్ యాంటీ బాడీలు న్నవారిలోనూ, టీకాలు తీసుకున్నవారిపైనా ప్రభావం చూపుతుందని డా.సురేశ్‌ పేర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Exit mobile version