
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఢిల్లీని ఆక్సీజన్ కోరత వేధిస్తోంది. ఆక్సీజన్ కొరత కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఢిల్లీ ఆసుపత్రులకు ఆక్సీజన్ సరఫరాకు కొరత లేకుండా చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వేగంగా ఆక్సీజన్ ట్యాంకర్లను తెప్పిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతుండటంతో, ఢిల్లీ ఆసుపత్రుల్లో ఖాళీలు లేక హోమ్ ఐసోలేషన్‌లో వేలాదిమంది కరోనా రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి ఆక్సీజన్ అవసరమైన వారికి నేరుగా ఆక్సీజన్ ను అందజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆక్సీజన్ అవసరమైన బాధితులు వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది ప్రభుత్వం. ఆక్సీజన్ కోసం ధరఖాస్తుతో పాటుగా ఆధార్, టెస్ట్ రిపోర్టును కూడా అటాచ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.