NTV Telugu Site icon

Delhi: 3కిలోమీటర్లకు ఒక ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్ పాయింట్.. ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళిక

Electric Vehicle

Electric Vehicle

Delhi: మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక ఛార్జింగ్ పాయింట్ ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ అన్నారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ఢిల్లీ ప్రభుత్వం రెండేళ్లు కొంచెం వరకు నష్టపోయిందని.. అయితే 2024 నాటికి మొత్తం వాహనాల రిజిస్ట్రేషన్లలో 25 శాతం ఎలక్ట్రిక్ వాహనాల లక్ష్యాన్ని చేరుకోగలదని ఆయన అన్నారు. ఛార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను సృష్టించడం అత్యంత ముఖ్యమైన లక్ష్యమన్నారు. ఢిల్లీలో ఇప్పటికే 2,000లకు పైగా ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. సుమారు 100 ఛార్జింగ్ స్టేషన్లు సృష్టించబడుతున్నాయన్నారు. మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ఛార్జింగ్ పాయింట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

Arvind Kejriwal: మనీష్ సిసోడియాకు భారతరత్న ఇవ్వాలి..

అనేక అవగాహన ప్రచారాలు, ప్రోత్సాహకాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎందుకు తగ్గాయని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది ఎలక్ట్రానిక్ వాహనాలను స్వీకరించడం లేదని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనం పూర్తి ఛార్జింగ్‌తో కొద్ది రేంజ్ దూరం వరకే వెళ్లగలుగుతుందని ఆయన అన్నారు. “రేంజ్ సమస్యను తయారీదారులు తప్పక పరిష్కరించాలని… సౌకర్యవంతమైన రేంజ్ సొల్యూషన్స్ అందించాలి” అని ఆయన అన్నారు. వాటి ధర కూడా ఎక్కువగా ఉండడం కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో వాటిని కొనకపోవడానికి కారణమని మంత్రి వెల్లడించారు.