Delhi: నిరసనకారులపై కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం.. ఒక్క షరతు!
- ఢిల్లీ నిరసనకారులకు గుడ్‌న్యూస్
- కేసులు కొట్టేసిన ఢిల్లీ ప్రభుత్వం
- నేరచరిత్ర ఉన్నవారిపై చర్యలుంటాయని షరతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ జంతర్‌మంతర్‌లో ఇటీవల జరిగిన నిరసనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి ప్రతికూల న్యాయ చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే క్రిమినల్ రికార్డు ఉన్న వారికి ఈ వెసులుబాటు వర్తించదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే నిరసనలకు సంబంధించి ఎవరైనా అరెస్ట్ అయి లేదా అదుపులో ఉంటే.. వారి కేసులను సమీక్షించి, వీలైనంత త్వరగా విడుదల చేసే ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిరసనల్లో పాల్గొన్న వారిపై ఇకపై ఎలాంటి అదనపు ప్రతికూల చర్యలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపింది. ఈ అంశాన్ని ముగిసిన వ్యవహారంగా పరిగణించి, భవిష్యత్తులో ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టబోమని స్పష్టం చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదంతో ఈ ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారం.

Also Read
- ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
‘‘ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత పరిధిలోని ఏ పోలీసు విభాగం కూడా ఈ నిరసనల్లో పాల్గొన్న వ్యక్తులపై ప్రతికూల న్యాయ చర్యలు తీసుకోదు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. క్రిమినల్ నేపథ్యం లేదా నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఈ రక్షణ వర్తించదు’’ అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాజధానిలో జరిగిన నీట్ నిరసనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మొత్తం 13 కేసులు నమోదు చేశారు. అయితే నిరసనల్లో పాల్గొన్న వ్యక్తులపై ఇకపై ఎలాంటి అదనపు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కేసుల వ్యవహారాన్ని ముగిసినదిగా పరిగణించి, ఈ అంశంపై భవిష్యత్తులో ఎలాంటి తదుపరి విచారణలు లేదా న్యాయపరమైన చర్యలు ఉండవని తెలిపింది.
మరోవైపు జంతర్‌మంతర్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల్లో పాల్గొన్న కొందరికి నేర చరిత్ర ఉందని ఢిల్లీ పోలీసులు గతంలో వెల్లడించారు. క్రిమినల్ రికార్డులు ఉన్నారని ఆరోపిస్తున్న వ్యక్తుల పోలీసు వివరాలు, ఫొటోలతో కూడిన డోసియర్‌ను కూడా పోలీసులు విడుదల చేసినట్లు సమాచారం. నిరసనల్లో పాల్గొన్న వారిలో 2 వేల మందికిపైగా నేర చరిత్ర ఉన్న వ్యక్తులను గుర్తించినట్లు ఆ డోసియర్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ పత్రాలను పార్లమెంట్‌కు కూడా సమర్పించినట్లు సమాచారం.
జనవరి 20 నుంచి జనవరి 25 మధ్య జంతర్‌మంతర్ పరిసరాల్లో జరిగిన నిరసనల్లో 2,800 మందికిపైగా నేర చరిత్ర ఉన్న వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో వీరిలో ఎవరైనా పాల్గొన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. అయితే ఢిల్లీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నేర చరిత్ర లేని నిరసనకారులపై తదుపరి ప్రతికూల చర్యలు ఉండవని స్పష్టమైంది.
ఇదిలా ఉండగా.. పౌరులపై పెల్లెట్ గన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పెల్లెట్ గన్ల వినియోగానికి సంబంధించి పోలీసు శాఖ దగ్గర ఉన్న అన్ని కీలక స్టాండింగ్ ఆర్డర్లు, మార్గదర్శకాలను రికార్డులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అలాగే నిరసనల సమయంలో పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్న వివరాలు, డ్యూటీ లాగ్‌లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి వినియోగానికి సంబంధించిన రికార్డులను భద్రపరచాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. జూలై 20న సీజేపీ నిర్వహించిన ‘సంసద్ చలో’ కార్యక్రమంలో పాల్గొన్న నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్లను ఉపయోగించారనే ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?