ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతి లభించింది. ఇదే కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్‌ను కూడా విచారించనున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. డిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బావేజాకు సీబీఐ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: S. Jaishankar: ప్రధాని ఉక్రెయిన్ పర్యటనను ‘చారిత్రాత్మకంగా’ అభివర్ణించిన కేంద్రమంత్రి..
ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 27తో ముగియనుంది. కేజ్రీవాల్, పాఠక్‌లను విచారించేందుకు అవసరమైన ఆంక్షలను పొందడానికి సీబీఐకి ఆగస్టు 12న కోర్టు 15 రోజుల గడువు ఇచ్చింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే సీఎం ప్రశ్నించేందుకు అనుమతి పొందినట్లు సీబీఐ పేర్కొంది. మరోవైపు, సీబీఐ అరెస్టును సవాలు, బెయిల్ విజ్ఞప్తిపై దాఖలు చేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను కదిలించిన మహిళా సర్పంచ్.. ఎవరీ కారుమంచి సంయుక్త?
జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సీబీఐని అనుమతించింది. కేజ్రీవాల్‌కు రీజయిండర్ దాఖలు చేయడానికి రెండు రోజుల సమయం ఇచ్చింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. సీబీఐ ఒక పిటిషన్‌పై మాత్రమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని.. గురువారం రాత్రి 8 గంటలకు తమకు అందజేశామని చెప్పారు. దీనిపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు స్పందిస్తూ.. వారం రోజుల్లో మరో పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Srisailam Project: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
