NTV Telugu Site icon

హస్తినలో భారీగా తగ్గిన కోవిడ్‌ కేసులు..

COVID 19

COVID 19

కరోనా కొత్త కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటికే లాక్‌డౌన్‌కు ముగింపు పలికి అన్‌లాక్‌కు వెళ్లిపోయింది దేశ రాజ‌ధాని ఢిల్లీ.. తాజాగా పాజిటివ్‌ కేసులు మరింత తక్కువగా నమోదు అయ్యాయి… ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్‌ బులెటిన్‌ ప్రకారం… గత 24 గంట‌ల్లో కేవ‌లం 316 కొత్త కేసులు వెలుగు చూశాయి.. మరో 41 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో కోలుకున్న కోవిడ్‌ బాధితుల సంఖ్య 521కు పెరిగింది.. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4,962గా ఉండగా.. ఢిల్లీలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 14,29,791కు చేరింది.. 14,00,161 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా… కోవిడ్ ఇప్పటి వరకు 24,668 మంది ప్రాణాలు తీసింది.. తాజా గణాంకాల ప్రకారం దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు 0.44 శాతానికి పడిపోయింది.