Site icon NTV Telugu

Brij bhushan singh: బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. పోక్సో కేసు కొట్టివేత

Brijbhushan Singh

Brijbhushan Singh

మాజీ రెజ్లింగ్ బాడీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు భారీ ఊరట లభించింది. అతనిపై ఉన్న పోక్సో కేసును ఢిల్లీ కోర్టు కొట్టేసింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద దాఖలైన లైంగిక వేధింపుల కేసును ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు సోమవారం క్లోజ్ చేసేసింది.

ఇది కూడా చదవండి: Israel-Gaza: ఇజ్రాయెల్ ఆధీనంలోకి గాజా.. కొత్త ప్లాన్ ఇదే!

ఢిల్లీ పోలీసులు జూన్ 15, 2023న దాఖలు చేసిన నివేదికను కోర్టు అంగీకరించింది. ఆగస్టు 1, 2023న ఆరోపించిన బాధితురాలు, ఆమె తండ్రి ఈ కేసులో పోలీసు నివేదికపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పోలీసుల దర్యాప్తు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ఆరుగురు రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదులో ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయగా.. మైనర్ ప్రమేయం ఉన్న కేసులో పోలీసులు రద్దు చేయాలని నివేదికను సమర్పించారు. పోక్సో కేసులో మైనర్ ఫిర్యాదుదారు మరియు ఆమె తండ్రి వాంగ్మూలాల ఆధారంగా కేసును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు సెక్షన్ 173 CrPC కింద నివేదికను సమర్పించారు. అనంతరం మైనర్ ఫిర్యాదుదారునికి మరియు ఆమె తండ్రికి కోర్టు నోటీసు జారీ చేసింది. వారి ప్రతిస్పందన కోరింది. ఆగస్టు 2023లో నోటీసుకు ప్రతిస్పందనగా మైనర్ ఫిర్యాదుదారు మరియు ఆమె తండ్రి కోర్టు ముందు హాజరయ్యారు. చివరికి కేసును క్లోజ్ చేయాలని పోలీసులు కోరగా.. అందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ కొట్టేసింది.

ఇది కూడా చదవండి: Off The Record: విజయసాయిరెడ్డికి స్ట్రాంగ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని వైసీపీ భావిస్తోందా..?

కోర్టు తీర్పుపై కుమారుడు ప్రతీక్ భూషణ్ సింగ్ స్పందించారు. తన తండ్రిపై మిగిలిన లైంగిక వేధింపుల కేసులు కూడా అబద్ధమని తేలిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

Exit mobile version