NTV Telugu Site icon

Delhi: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ ఎన్నిక

Rekha Gupta

Rekha Gupta

ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో రేఖా గుప్తా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక ప్రొటెం స్పీకర్‌గా అరవిందర్ సింగ్ లవ్లీ ఎన్నికయ్యారు. రాజ్ నివాస్‌లో అరవిందర్ సింగ్ లవ్లీతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రొటెం స్పీకర్.. ప్రమాణం చేయించారు. ముందుగా సీఎం రేఖా గుప్తా, అనంతరం ఢిల్లీ కేబినెట్ మంత్రులు పర్వేష్ సాహిబ్ సింగ్, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్ ప్రమాణం చేశారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది.

ఇది కూడా చదవండి: SLBC Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉంటారని భావించలేం: ఎన్డీఆర్ఎఫ్

ఇక ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి ఎన్నికయ్యారు. సమావేశాలకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను గౌరవిస్తామని.. ప్రజల గొంతుకగా బాధ్యతను నెరవేరుస్తామని చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు రూ.2,500 పథకం అమలు చేస్తామని ప్రధాని మోడీ అన్నారని.. ఇదే విషయంపై అసెంబ్లీలో ప్రస్తామని చెప్పారు. హామీల అమలు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పని చేస్తారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందంటూ బీజేపీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని.. ఇలాంటి విధానాన్ని తిప్పికొడతామని అతిషి అన్నారు.

ఇది కూడా చదవండి: SLBC Tunnel: టన్నెల్‌లో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉంటారని భావించలేం: ఎన్డీఆర్ఎఫ్

ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.