Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Building Collapse: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సైదులాజాబ్ ప్రాంతంలో ఒక ఐదు అంతస్తుల భవనం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. క్షణాల వ్యవధిలోనే భారీ భవనం కుప్పలుగా మారిపోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన ధూళి, కేకలతో అల్లకల్లోలంగా మారింది. భవనం ఉన్నట్టుండి కూలిపోవడంతో ఆ సమయంలో లోపల ఉన్న నివాసితులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం శిథిలాల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. భవనం కూలిన శబ్దానికి చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సంఘటనా స్థలంలో బాధితుల బంధువుల ఆర్తనాదాలు, కేకలతో తీవ్ర గందరగోళం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సమాచారం అందిన వెంటనే మెహ్రౌలీ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు మరియు ఫైర్ సిబ్బంది భారీగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాలను వేగంగా తొలగించి, వాటి కింద ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న ప్రజలను ప్రాణాలతో రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను తరలించేందుకు వీలుగా ఘటనా స్థలంలో అంబులెన్స్‌లను కూడా సిద్ధంగా ఉంచారు. భవనం కూలడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?