Budget: 9వ తరగతి బాలికలకు సైకిళ్లు.. టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. బడ్జెట్‌లో విద్యార్థులపై వరాలు

  • 9వ తరగతి బాలికలకు సైకిళ్లు
  • టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు
  • బడ్జెట్‌లో విద్యార్థులపై వరాలు
Budget

Budget

ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో బడ్జెట్ల కాలం నడుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 2026-27 సంవత్సరానికి గాను బడ్జెట్లు ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 1.03 లక్షల కోట్ల బడ్జెట్ 2026–27ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులపై రేఖా గుప్తా వరాల జల్లు కురిపించారు. 9వ తరగతి బాలికలకు సైకిళ్లు, 10వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించారు. మంగళవారం ఆమె ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాల్లో చదివే 9వ తరగతి బాలికలకు సైకిల్ బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇక ఈసారి ‘‘గ్రీన్ బడ్జెట్’’ ప్రవేశపెట్టినట్లుగా రేఖా గుప్తా పేర్కొన్నారు. ‘‘ప్రతి ప్రణాళికను ‘హరిత దృష్టికోణం’తో చూశాం. ఈ బడ్జెట్‌లోని ప్రతి విధానం పర్యావరణ ప్రభావాన్ని కలిగి ఉంది. ప్రతి ప్రణాళిక ప్రకృతిపై ప్రభావాన్ని కలిగి ఉంది. ప్రతి నిర్ణయం భవిష్యత్ తరాల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుంటుంది. అందుకే పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఖర్చు చేసే ‘‘గ్రీన్ బడ్జెట్’’ కోసం మొత్తం బడ్జెట్‌లో 21 శాతం కేటాయించాం. ఈ బడ్జెట్ ప్రభుత్వ ఆలోచనా విధానంలో ఒక చారిత్రాత్మక మార్పు. అభివృద్ధికి, భూమి పరిరక్షణకు మధ్య సమతుల్యత నెలకొల్పబడింది. ఇది నేటి అతిపెద్ద అవసరం.’’ అని రేఖా గుప్తా పేర్కొన్నారు.