NTV Telugu Site icon

Delhi Assembly Election Results 2025: నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు..

Delhi Result

Delhi Result

దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నిలక పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించాయి. నాలుగోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆప్, సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో పనిచేశాయి. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు తేలనున్నాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నేడు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానున్నది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఈవీఎంల్లో ఉన్న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో నేడు తేలనున్నది. ఫలితాల వేళ దేశమంతా ఢిల్లీ వైపు ఉత్కంఠతతో ఎదురుచూస్తోంది. ఫలితాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.