NTV Telugu Site icon

Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్నినల్-2 తాత్కాలికంగా మూసివేత.. కారణమిదే!

Delhiairportterminal 2

Delhiairportterminal 2

దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్-2ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) సీఈవో విదేహ్ కుమార్ జైపురియార్ తెలిపారు. పునరుద్ధరణ పనుల కోసం టెర్మినల్-2 మూసివేస్తున్నట్లు వెల్లడించారు. పునరుద్ధరణ పనులు 2025-26లో ప్రారంభమై.. ఆరు నెలల్లో ముగిస్తాయని అంచనా వేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Hyderabad: గోషామహల్లో మరోసారి కుంగిన చాక్నావాడి నాళా..

టెర్మినల్-2 నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 1,300 విమానాల రాకపోకలు సాగిస్తుంటాయి. పునరుద్ధరణ పనుల కోసం నాలుగు నుంచి ఆరు నెలల పాటు మూసివేయనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి కానున్నాయి. దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం. ఇక్కడ టెర్మినల్-1, టెర్మినల్-2, టెర్మినల్-3 ఉన్నాయి. టెర్మినల్-1, 2 దేశీయ విమానాలకు ఉపయోగిస్తున్నారు. అయితే టెర్మినల్-2 ప్రారంభమై దాదాపు 40 సంవత్సరాలు గడుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులకు తగ్గట్టుగా చేయాలని భావిస్తోంది. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2025 నుంచి పనులు ప్రారంభం అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే టెర్మినల్-2 మూసివేత కారణంగా కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చని భావిస్తున్నారు. ఇటీవల కొత్తగా అభివృద్ధి చేసిన టెర్మినల్-1పై అధిక భారం పడే అవకాశం ఉంది. ప్రయాణికులకు అసౌకర్యం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Vishal : హీరో విశాల్ హెల్త్ కండీషన్ పై స్పందించిన స్టార్ హీరో..ఏమన్నారంటే ?

Show comments