Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇండ్లు, కార్యాలయాల లోపల కూడా పొగ అలుముకోవడంతో ఢిల్లీ వాసులకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. కళ్లు పొడిబారడం, మంట లాంటి సమస్యలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ఈ రోజు (మంగళవారం) ఏక్యూఐ 500 మార్క్ తాకింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) IV ప్రస్తుతం దేశ రాజధానిలో కఠినమైన ఆంక్షలనను అమలు చేస్తుంది. ఈ కాలుష్యం తీవ్రతకు వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంత తీవ్రమైన కాలుష్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని ఢిల్లీ ప్రజలు పేర్కొంటున్నారు. ఊపిరి తీసుకుంటున్నామో, పొగ తాగుతున్నామో అర్థం కానంతగా కాలుష్యం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Devaki Nandana Vasudeva : ‘దేవకీ నందన వాసుదేవ’ ప్రీ-రిలీజ్ గెస్టులు వీరే..!
కాగా, ఢిల్లీ నగరంలో సోమవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 494గా రికార్డు అయ్యింది. గత ఆరేళ్లలో ఇది రెండోసారి అత్యధికం అని అధికారులు చెప్పారు. ఇక, సీపీసీబీ లెక్కల కంటే చాలా ప్రమాదకరంగా కాలుష్యం మారినట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ తెలిపింది. ఈ గాలి కాలుష్యం కారణంగా ఇప్పటికే 14 విమానాలను దారి మళ్లించగా.. మరి కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక, పాఠశాలలు, కాలేజీలను మూసి వేసి ఆన్‌లైన్ తరగతులు చెప్తున్నారు.