NTV Telugu Site icon

Delhi Air Pollution: ఢిల్లీలో పూర్తిగా క్షీణించిన గాలి నాణ్యత.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే

Delhi

Delhi

Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(ఏక్యూఐ) 500 పాయింట్లుగా నమోదై కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి వెళ్లిపోయింది. గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ నగరం అంతటా దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read Also: Shamshabad: మూడు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్..

ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా అధికారులు పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏక్యూఐ 500 పాయింట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి 65 రెట్లు ఎక్కువ కావడం గమనార్హంగా చెప్పొచ్చు. అయితే, శనివారం రాత్రి 9 గంటలకు 327గా ఉన్న ఏక్యూఐ కేవలం 10 గంటల్లో ఆదివారం ఉదయానికల్లా 500 పాయింట్లు దాటడం ఢిల్లీ వాసులను తీవ్ర కలవరపరుస్తోంది.

Show comments