NTV Telugu Site icon

Delhi Accident: నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురి దుర్మరణం

Delhi Accident

Delhi Accident

Delhi Accident: ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు డివైడర్ పై నిద్రిస్తున్న వారిపైకి వెళ్లింది. దీంతో నిద్రిస్తున్న నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కును గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరు మరణించారు.

Read Also: Minister KTR : సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మంత్రి కేటీఆర్‌ ప్రశంస

బుధవారం తెల్లవారుజామున 1.51 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ పై నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లడంతో పాటు రోడ్డు దాటుతున్న మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కును కనుక్కునేందుకు పోలీసుల ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. మరణించిన నలుగురిని కరీం(52), చోట్టే ఖాన్లు(25), షా ఆలం(38), రాహుల్ (45)గా గుర్తించారు. గాయడిన వారిలో 16 ఏల్ల మనీష్, 30 ఏళ్ల ప్రదీప్ ఉన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం వేట సాగిస్తున్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

Show comments