honeytrap: దాయాది దేశం పాకిస్తాన్ భారత్ పై చేస్తున్న కుట్రలు చేస్తూనే ఉంది. ఇప్పటికే కొందరు భారత సైనికులతో పాటు అధికారులను హనీట్రాప్ ముగ్గులోకి దించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ సంస్థలు ముందుగానే పసిగట్టి వారిని అరెస్ట్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ సైంటిస్టు కూడా పాకిస్తాన్ హనీట్రాప్ లో చిక్కుకున్నారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ)లో పనిచేస్తున్న సైంటిస్టు పాకిస్తాన్ ఏజెంట్స్ తో టచ్ లో ఉన్నట్లు మహారాష్ట్ర యాంటీ టెర్రిరిజం స్వ్కాడ్(ఏటీఎస్) అధికారులు గురువారం తెలిపారు.
Read Also: Manipur Violence: అదుపులో మణిపూర్ పరిస్థితి.. మరిన్ని బలగాలు మోహరింపు..
భారతదేశానికి చెందిన రక్షణ సమాచారాన్ని వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా ‘‘పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్’’ ఏజెంట్స్ కు అందిస్తున్నాడని ఏటీఎస్ అధికారి తెలిపారు. డిఫెన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నత పదవిలో ఉన్న నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన సమాచారం అందించడం ప్రమాదం అని తెలిసి కూడా నిందితుడు శత్రు దేశానికి సమాచారం చేరవేశాడని ఏటీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. అధికారిక రహస్యాల చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ముంబై ఏటీఎస్ కాలాచౌకి యూనిట్ కేసు నమోదు చేసింది. తదుపరి విచారణ కొనసాగుతోందని, శాస్త్రవేత్త ఎలాంటి సమాచారాన్ని పాక్ ఏజెంట్స్ కు అందించాడనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.