Site icon NTV Telugu

Rajnath Singh: ఆపరేషన్ సిందూర్-2, 3 పార్టులు పాక్ తీరుపై ఆధారపడి ఉంటుంది

Rajnath Singh

Rajnath Singh

ఆపరేషన్ సిందూర్-2, 3 భాగాలు అనేది పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. మొరాకోలోని భారతీయ సమాజంతో జరిగిన సంభాషణలో రాజ్‌నాథ్‌సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. 2, 3 భాగాలు కూడా ఉండొచ్చని హెచ్చరించారు. ఇది కేవలం పాకిస్థాన్ ప్రవర్తనపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం తగిన సమాధానం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ చివరి చూపు కోసం లక్షలాదిగా తరలివచ్చిన అస్సామీయులు.. 25 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

పహల్గామ్‌లో మతం పేరుతో 26 మందిని ఉగ్రవాదులు చంపేశారని.. ఇది భారతీయులను కలిచి వేసిందన్నారు. అనంతరం యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని తాను త్రివిధ దళాలను అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారని గుర్తుచేశారు. అటు తర్వాత ప్రధాని మోడీని సంప్రదించగా ముందుకు సాగమని బదులిచ్చారని తెలిపారు. త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. ఏం జరిగిందో కళ్లరా మీరే చూశారు కదా? అన్నారు. 100 కి.మీల దూరంలో ఉన్న ఉగ్రవాదల స్థావరాలను ధ్వంసం చేశారని 100 మంది ఉగ్రవాదులు హతం కావడం.. వారి స్థావరాలు ధ్వంసం అయినట్లు తాజాగా ఆ ఉగ్ర సంస్థలే ప్రకటించాయని పేర్కొన్నారు. మసూద్ అజార్ కుటుంబం ధ్వంసం అయిందని జైషే ఉగ్ర సంస్థ తెలిపిందని చెప్పారు. కాల్పుల విరమణను పాకిస్థానే కోరిందని.. అందుకు భారత్ అంగీకరించడంతో కాల్పుల విరమణ జరిగిందని వెల్లడించారు. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అటల్ బీహారి వాజ్‌పేయ్ చెప్పినట్లుగా అందరితో మంచి సంబంధాలు ఉండాలని చెప్పేవారని.. మేము కూడా అదే కోరుకుంటున్నామని.. స్నేహితులనైతే మార్చవచ్చు.. కానీ పొరుగువారిని మార్చలేం కదా? అన్నారు. సరైన మార్గంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని.. కేవలం ఆపరేషన్ సిందూర్ విరామం మాత్రమేనని.. తేడా వస్తే మళ్లీ జులుం ప్రదర్శిస్తామని రాజ్‌నాథ్‌సింగ్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Trump-Musk: ట్రంప్-మస్క్‌ను కలిపిన చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం.. పక్కపక్కనే కూర్చుని సంభాషణ

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. మతం పేరుతో 26 మందిని చంపేశారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సిందు జలాలు నిలిపివేసింది. అంతేకాకుండా అటరీ సరిహద్దు మూసేసింది. అనంతరం వీసాలను రద్దు చేసింది. ఇక మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

 

Exit mobile version