Site icon NTV Telugu

Uttar Pradesh: అంత్యక్రియల్లో కళ్లు తెరిచిన మహిళ.. షాకైన బంధువులు..

Up Incident

Up Incident

woman opens her eyes en route to crematorium: ఉత్తరప్రదేశ్ లో విచిత్ర సంఘటన జరిగింది. చనిపోయిందనుకున్న మహిళ మళ్లీ కళ్లు తెరిచింది. అంత్యక్రియలు చేస్తుండగా ఒక్కసారి కళ్లు తెరవడంతో బంధువులంతా షాకయ్యారు. ఈ ఘటన యూపీలోని ఫిరోజాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే హరిభేజీ అనే 81 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. బ్రెయిన్ హెమరేజ్ తో బాధపడుతున్న సదరు వృద్ధరాలు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బంధువలంతా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శ్మశాన వాటికకు తీసుకెళ్తున్న క్రమంలో మహిళ కళ్లు తెరిచింది. దీంతో బంధువులంతా ఆమెను ఇంటికి తీసుకువచ్చారు.

Read Also: Lover Attack : పెళ్లి చేసుకోమని విసిగించింది.. ప్రియురాలిని తగులబెట్టాడు

ఇదిలా ఉంటే ఒక రోజు బతికిన హరిభేజీ తరువాత రోజు మరణించింది. డిసెంబర్ 23న ఆమెను ఫిరోజాబాద్ లోని ట్రామా సెంటర్ లో చేర్పించారు. మంగళవారం బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్థారించారు. ఈ క్రమంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తున్న క్రమంలో కళ్లు తెరిచింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. బుధవారం ఆమె పరిస్థితి విషమించడంతో చనిపోయింది. ఆ తరువాత ఆమె కుమారుడు సుగ్రీవ్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ముందుగా తన తల్లి బతికే ఉందని.. వైద్యులు మరణించినట్లు చెప్పారని తెలిపాడు.

Exit mobile version