New criminal laws: మూకదాడికి పాల్పడితే ఇక మరణశిక్షే.. దేశద్రోహ చట్టానికి ఇక చెల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New criminal laws: కేంద్రం కొత్తగా మూడు క్రిమినల్ చట్టాలను తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లులను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టారు. దీనిపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా బుధవారం లోక్‌సభలో మాట్లాడారు. ఇకపై మూకదాడికి పాల్పడిన నేరాల్లో మరణశిక్ష విధించే నిబంధన ఉందని చెప్పారు. అలాగే స్వాతంత్ర సమరయోధులను జైలులో పెట్టడానికి బ్రిటీష్ వారు తీసుకువచ్చిన దేశద్రోహ చట్టాన్ని తొలగించాలని కేంద్రం నిర్ణయించినట్లు అమిత్ షా ప్రకటించారు.
బుధవారం మూడు క్రిమినల్ చట్టాలను అమిత్ షా లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. బ్రిటీష్ వారు చేసిన దేశద్రోహ చట్టం, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి స్వాతంత్ర సమరయోధులను అనేక ఏళ్లు జైలులో ఉంచింది. ఈ చట్టం ఈ రోజు వరకు కొనసాగుతోంది. మొట్టమొదటి సారిగా మోదీ ప్రభుత్వం ఈ దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తుంది అని ఆయన లోక్‌సభలో ప్రకటించారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
Read Also: Pakistan: పాకిస్తాన్లో మరొకడిని లేపేశారు..
కొత్త బిల్లులు శిక్షకు బదులుగా న్యాయంపై దృష్టి సారించేలా దేశంలో నేర న్యాయ వ్యవస్థను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు-2023, భారతీయ సాక్ష్యా బిల్లు-2023లను మొదటిసారిగా కేంద్ర ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుల్లో సవరణలు తీసుకువచ్చి మళ్లీ ప్రవేశపెట్టారు.
కొత్త న్యాయచట్టాలు పోలీస్ జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే వ్యవస్థగా తీసుకువస్తామని అమిత్ షా అన్నారు. అరెస్టయిన వ్యక్తలు గురించి వివరాలు ఇప్పుడు ప్రతీ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడాలని, ఈ రికార్డులను నిర్వహించే బాధ్యత పోలీస్ అధికారిదే అని ఆయన అన్నారు. అక్రమ రవాణా చట్టాలను లింగ తటస్థంగా మార్చిందని చెప్పారు. 18ఏళ్ల లోపు బాలికపై అత్యాచారం చేస్తే, కొత్త చట్టాల ప్రకారం పోక్సో చట్టానికి సమానమైన నిబంధనలు ఆటోమెటిక్‌గా వర్తిస్తాయని అన్నారు.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!