NTV Telugu Site icon

Wayanad landslide: ఆర్మీ సాహసాలపై 3వ తరగతి విద్యార్థి హార్ట్‌ టచ్ లేఖ

Wayanadlandslide

Wayanadlandslide

వయనాడ్‌లో ప్రకృతి విలయతాండవం చేసింది. మంగళవారం కొండచరియలు విరిగిపడి 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. అనంతరం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగి చేపట్టిన సహాయ చర్యలు భారతీయుల్ని కట్టిపడేస్తున్నాయి. విపత్కర పరిస్థితుల్లో సాహసం చేసి బాధితుల్ని రక్షిస్తున్నారు. అంతేకాకుండా శిథిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్మీ ధైర్యసాహసాలను చూసిన ఓ చిన్నారి చలించిపోయాడు. వారిని ఉద్దేశించి మూడో తరగతి విద్యార్థి రాసిన లేఖ ఇప్పుడు హృదయాలను కదిలిస్తోంది.

డియర్ ఇండియన్ ఆర్మీ అంటూ సంభోదిస్తూ లేఖ రాశాడు. వయనాడ్‌లో మీరు చేస్తున్న సాహసాలను చూసి చలించిపోయాను. ఏదో ఒక రోజు సైన్యంలో చేరాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. మిమ్మల్ని చూసి గర్వంగా మరియు సంతోషంగా ఉన్నట్లు మలయాళంలో AMLP స్కూల్ విద్యార్థి రేయాన్ రాశాడు.