కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఏకైకమార్గం వ్యాక్సినేషనే.. దీంతో, అన్ని దేశాలు క్రమంగా వ్యాక్సిన్లు కనుగొనడం, అభివృద్ధి చేయడం, పంపిణీ చేయడంపై దృష్టిసారించాయి.. ఇప్పటికే భారత్‌లో పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.. పెద్దలు, చిన్నారులకు ఇలా వేర్వేరుగా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. తాజాగా, మరో రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ). అందులో ఒకటి జెన్నోవా బయో – ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసింది కాగా.. మరోటి సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన టీకాలు ఉన్నాయి.
Read Also: Rain Alert: తెలంగాణకు వర్ష సూచన, నేడు, రేపే భారీ వర్షాలు
జెన్నోవా బయో-ఫార్మాస్యూటికల్స్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లుపైబడినవారికి ఇవ్వనున్నారు.. ఇక, సీరం తయారు చేసిన కొవొవాక్స్ ను 7-11 ఏళ్ల వయసు చిన్నారులకు వేయనున్నారు.. ఈ రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.. దీనికోసం ఎస్‌ఐఐలో ప్రభుత్వ నియంత్రణ వ్యవహారాల విభాగం డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్ సింగ్ మార్చి 16వ తేదీన దరఖాస్తు చేశారు.. దీనిని పరిశీలించిన కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ.. అత్యవసర వినియోగానికి అనుతి ఇవ్వొచ్చని పేర్కొంది.. ఇక, చిన్నారులకు వ్యాక్సిన్‌ను అందించేందుకు తాజాగా డీసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో.. మరో రెండు స్వదేశీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్టు అయ్యింది.
