NTV Telugu Site icon

Darshan Case: దర్శన్‌ని భయపెడుతున్న రేణుకాస్వామి ఆత్మ..

Maxresdefault

Maxresdefault

Darshan Case: కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతని అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. దర్శన్‌కి నటి పవిత్ర గౌడకు ఉన్న సంబంధంపై రేణుకాస్వామి, పవిత్ర గౌడకు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టడమే అతడి మరణానికి కారణమైంది. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని దర్మన్ గ్యాంగ్ కిడ్నాప్ చేసి, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా కొట్టి, చిత్రహింసలు పెట్టి అతను మరణించేలా చేశారు. ఈ కేసులో మొత్తం 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Zomato: భార్యతో కలిసి ఫుడ్ డెలివరీ చేసిన జొమాటో సీఈవో గోయల్

ముందుగా బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌కి రిమాండ్ విధించారు. అయితే, ఆ జైలులో వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో అతని బళ్లారి జైలుకు తరలించారు. ఈ జైలుకు తరలించినప్పటి నుంచి దర్శన్‌ని రేణుకాస్వామి ఆత్మ భయపెడుతోందని జైలు సిబ్బందికి చెబుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి భయపెడుతోందని జైలులో ఉన్న ఖైదీలతో దర్శన్ చెబుతున్నాడట. భయంతో తనకు నిద్ర పట్టడం లేదని చెప్పినట్లు సమాచారం. తనను బెంగళూర్ జైలుకి తరలించాలని జైలు అధికారుల్ని కోరినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో దర్శన్ నిద్రలో కలవరిస్తున్నాడని, గట్టిగా కేకలు వేస్తున్నట్లు ఖైదీలు చెబుతున్నారు.

రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూర్ తీసుకువచ్చి అత్యంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపారు నిందితులు. తనను వదిలేయాలని ప్రాధేయపడినప్పటికీ విడిచిపెట్టలేదని తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకా స్వామి ఒంటిపై 39 గాయలు ఉన్నాయి. తలపై లోతైన గాయం ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది. ప్రైవేట్ భాగాలకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారని, పదేపదే షాక్ ఇవ్వడం వల్ల వృషణాల్లలో ఒకటి బాగా దెబ్బతిన్నట్లు నివేదిక చెప్పింది.

Show comments