NTV Telugu Site icon

Darshan Case: రేణుకా స్వామి చిత్రహింసలు చూస్తూ పవిత్ర గౌడ ఆనందం..

Darshan Case

Darshan Case

Darshan Case: కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శించిన రేణుకాస్వామిని(33) దారుణంగా హత్య చేశారు. చిత్రదుర్గకు చెందిన ఫార్మసీలో పనిచేసే వ్యక్తిని బెంగళూర్ తీసుకువచ్చి హింసించి హత్య చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కసారి కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. పెళ్లై భార్య, కుమారుడు ఉన్న దర్శన్, పవిత్ర గౌడతో రిలేషన్‌ ఉండటం గురించి అసభ్యకరమై పోస్టులు పెట్టడంతోనే రేణుకా స్వామి హత్య జరిగింది.

Read Also: Goa: “మద్యం తాగుతారు, చెత్త వేస్తారు”..గోవాలో ఫేమస్ బీచ్‌కి వెళ్లాలంటే రిజర్వేషన్ తప్పనిసరి..

ఇదిలా ఉంటే, జూన్ 8న స్వామిని అతని స్వస్థలం చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూర్‌లోని ఓ షెడ్‌కి తీసుకువచ్చారు. అతడిని కర్రలతో కొట్టడంతో పాటు పలుమార్లు కరెంట్ షాక్‌కి గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అతని వృషణాలపై తన్నడంతో తీవ్రగాయాలైనట్లు వెల్లడైంది. చిత్రహింసలు పెడుతున్న సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్వామి సోషల్ మీడియా పోస్టుల కారణంగా పవిత్రనే దర్శన్‌ని దాడికి ప్రేరేపించినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేయగా, తమకు బదులుగా నేరం వేరే వారిపై వేసుకోవాలని దర్శన్ రూ. 50 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 30 లక్షలు కిడ్నాప్, హత్య మరియు మృతదేహాన్ని పారవేయడం పర్యవేక్షించిన ప్రదోష్ అలియాస్ పవన్ అనే వ్యక్తికి చెల్లించారు. రాఘవేంద్ర మరియు కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ₹ 5 లక్షలు చెల్లించాల్సి ఉంది. హత్య జరిగిన రోజు దర్శన్, పవిత్రలా చెప్పులతో పాటు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, దర్వన్ పోలీస్ కస్టడీని గురువారం రెండు రోజులు పొడగించారు.