Dangerous Man Sarfaraz Memon Caught By Indore Police: పాకిస్తాన్, చైనా, హాంగ్‌కాంగ్‌లలో శిక్షన పొందిన సర్ఫరాజ్ మెమోన్ అనే వ్యక్తి ముంబైకి చేరుకున్నట్లు ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) గుర్తించింది. దీంతో వాళ్లు వెంటనే ముంబై పోలీసులకు సమాచారం అందించారు. ఆ వ్యక్తి భారత్‌కి చాలా ప్రమాదకరమని కూడా ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు.. ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలతో పాటు ముంబై పోలీసులు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులకు ఈమెయిల్ కూడా చేసింది. ఇండోర్‌కు చెందిన సర్ఫరాజ్ మెమోన్ అనే వ్యక్తి.. చైనా, పాక్, హాంకాంగ్ వంటి దేశాల్లో శిక్షణ పొందాడని, అతడు ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలియజేసింది. తాజాగా అతడు ముంబైకి చేరుకున్నాడని తెలిపిన ఎన్‌ఐఏ.. అతని ఫోటోలు, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ట్‌పోర్ట్ వంటి వివరాలను పోలీసులకు మెయిల్ ద్వారా పంపించింది. వీలైనంత త్వరగా అతడ్ని పట్టుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అతని ఆచూకీ కోసం గాలించారు. ఎట్టకేలకు అతడు ఇండోర్‌లో దొరికాడు. అతడ్ని విచారించేందుకు ముంబై పోలీసులు సైతం రంగంలోకి దిగారు.
Rohit Sharma: వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ని తొలగించడంపై రోహిత్ రియాక్షన్
అసలు ఈ సర్ఫరాజ్ మెమోన్ గురించి ఎన్ఐఏకి ఎలా తెలిసిందో తెలుసా? ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది. వీళ్లు పాకిస్తాన్‌లో శిక్షణ తీసుకోవడం కోసం సరిహద్దు దాటుతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు నిందితుల్ని మహారాష్ట్రలోని థానే వెస్ట్‌కు చెందిన ఖలీద్ ముబారక్ ఖాన్ (21), తమిళనాడుకు చెందిన అబ్దుల్లా (26)గా గుర్తించారు. తామిద్దరం అక్రమంగా సరిహద్దు దాటి, ఆయుధ శిక్షణ పొందడం కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు ప్లాన్ చేశామని తెలిపారు. వీళ్లే సర్ఫరాజ్ మెమోన్ గురించి సమాచారం ఇచ్చారు. అతడు చైనా, పాక్‌లలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడని.. ఆల్రెడీ ముంబైలో అడుగుపెట్టాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై, ఇండోర్ పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ఎన్ఐఏ సూచించింది. ఆ ఇద్దరు ఉగ్రవాదుల నుంచి 2 తుపాకులు, 10 లైవ్ కాట్రిడ్జ్‌లు, ఒక కత్తి, వైర్ కట్టర్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Love Tragedy: మరో యువతితో పెళ్లి.. ప్రియురాల్ని మర్చిపోలేక యువకుడు ఆత్మహత్య