NTV Telugu Site icon

Tamil Nadu: బుల్లెట్ బండి నడిపినందుకు.. దళిత విద్యార్థి చేతులు నరికివేత..

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: పెరియార్ సిద్ధాంతం, కుల-మత రహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పే తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కుల దురహంకారం, పరువు హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని శివగంగై జిల్లాలోని మెలపిడావూర్ సమీపంలో దళిత విద్యార్థిపై అగ్రకులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతడి చేతులు నరికేశారు. ప్రభుత్వ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితుడు అయ్యసామి(20) బుధవారం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దాడికి గురయ్యాడు.

Read Also: Titanic Submersible: సముద్రగర్భంలో “టైటానిక్ సబ్‌మెర్సిబుల్” విషాదం.. పేలుడు క్షణాల ఆడియో వైరల్..

అయ్యసామి తల్లి ప్రకారం.. దాడి చేసిన వ్యక్తులు, దాడికి పాల్పడే ముందు కుల దూషణలు చేశారని చెప్పింది. దాడికి గురైన బాధితుడిని గ్రామస్తులు మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ముగ్గురు నిందితులు వినోద్, ఆది ఈశ్వరర్, వల్లరసులను పోలీసులు అరెస్ట్ చేశారు.

బుల్లెట్ బండి నడిపినందుకు అగ్ర కులస్తులు ఈ దాడికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. బాధితుడు అయ్యసామి అంకుల్ గతేడాది బుల్లెట్ బండి కొనిచ్చాడు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బండితో కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో దాడి జరిగింది. చేతుల్ని నరికేసి, ‘‘ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి బుల్లెట్ బండి ఎలా నడపగలడు?’’ అంటూ నిందితులు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం బాధితుడి చేతులు అతికించేందుకు వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. అయితే, ఆపరేషన్ సంక్లిష్టంగా ఉందని, ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని వైద్యులు చెప్పారు.